Naveen Jindal: నవీన్ జిందాల్‌కు ఖైదీ బెదిరింపు లేఖ.. రూ. 50 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Jindal: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆ లేఖను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని జైలు నుంచి ఓ ఖైదీ పంపినట్లు తేలింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని జైలు నుంచి ఒక ఖైదీ రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన రాయగఢ్‌లోని స్టీల్ ప్లాంట్‌కు బెదిరింపు లేఖ పంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ లేఖ గత వారం పత్రపాలి గ్రామంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) కర్మాగారానికి పోస్ట్ ద్వారా పంపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 48 గంటల్లోగా డబ్బు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ వ్యాపారి రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా
బిలాస్‌పూర్ కేంద్ర కారాగారంలోని ఖైదీ లేఖ రాసినట్లు దర్యాప్తులో వెల్లడైంది, దీని తర్వాత కోత్రారోడ్ పోలీసులు సోమవారం అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. రూ.100కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గల గడ్కరీ కార్యాలయానికి ఒకే రోజు రెండు ఫోన్‌కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం అతడు కూడా ఖైదీ అని దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!