Site icon NTV Telugu

Bode Prasad: నా పిల్లల మీద ఒట్టు.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు…!

Bode Prasad

Bode Prasad

Bode Prasad: మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ముందే చెప్పాను.. నాకు వంశీ, కొడాలితో సత్సంబంధాలే ఉంటే నేను ఎందుకు చెబుతాను? అని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధంలేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, నారా భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు.. పని చేయటం రాని వాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ? అంటూ మండిపడ్డారు.

Read Also: RCB vs CSK: చెన్నై vs బెంగళూరు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

ఇక, పెనమలూరు టీడీపీలో పంచాయతీ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికల్లో పోటీపై బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నానన్న ఆన.. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందన్నారు. బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానన్న బోడే.. నాకంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారని భావిస్తున్నాను.. ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం అన్నారు. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా? అని వంశీ అన్నాడు.. నేను వల్లభనేని వంశీతో మాట్లాడటం, కలవటం జరగలేదు అని స్పష్టం చేశారు. ఇది జరిగిందని ఎవరైనా చెబితే దమ్ముంటే వాళ్లు నిరూపించాలి అంటూ సవాల్‌ చేవారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.

Exit mobile version