నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చేసింది.. అంతేకాదు పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్ తోనే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చేశాడు..
గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమాతో బాగా పాపులర్ అయిన బాబీ డియోల్’.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ లోకి ఇతను ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.. మేకర్స్ షూటింగ్ సెట్ లో అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ మూవీ నుంచి యాక్షన్ కట్ తో గ్లింప్స్ రిలీజ్ చేసి అదుర్స్ అనిపించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వీరమాస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం..
THE HUNTER ENTERS💥
Welcome aboard #BobbyDeol garu 🔥
Your terrific screen presence is set to make our #NBK109 more special for us movie lovers and NBK fans. ❤️🔥#NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts… pic.twitter.com/sIw8DpjWBF
— Sithara Entertainments (@SitharaEnts) April 23, 2024