NTV Telugu Site icon

Boat Races: కేరళను తలపించేలా ఆత్రేయపురంలో పడవల పోటీలు..

Boat Races

Boat Races

మూడు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. ఒక కిలోమీటరు డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా , జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవ పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. గత మూడు రోజులుగా గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ జరిగాయి. 11 జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు, 12 జట్లు పోటీ పడ్డాయి. పోటీలను పెద్ద సంఖ్యలో స్థానికులు తిలకించారు. కోనసీమలో పర్యాటక అభివృద్ధి కోసం ఈ సంక్రాంతికి ఆత్రేయపురం వద్ద భారీ స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించారు. కేరళను తలపించే విధంగా ఆత్రేయపురం వద్ద పడవల పోటీలు నిర్వాహించారు.

Read Also: HMPV Cases: చైనాలో తగ్గుముఖం పట్టిన HMPV వైరస్ కేసులు.. భారత్ పరిస్థితి ఏంటంటే ?

మరోవైపు.. విశాఖ మత్స్యకార గ్రామాల్లో సంక్రాంతి జోష్ నెలకొంది. వరాహ నదిలో జిల్లా స్థాయి పుట్టుల పోటీలు నిర్వహించారు. ఎస్.రాయవరం( మం) బంగారమ్మ పాలెంలో 40 మందికి పైగా మత్స్యకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నలుగు రౌండ్లలో పోటీ నిర్వహించారు. పుట్టుల మీద వేటకు వెళ్ళే మత్స్యకారులుజజ భోగినాడు పోటీలు పెట్టుకోవడంతో చుట్టు పక్కల గ్రామస్థులు చూసేందుకు భారీగా తరలి వచ్చారు.

Read Also: Bhatti Vikramarka: తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు..

Show comments