Boat Capsized: కేరళలోని అలప్పుజాలో పడవ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం పడవ పోటీల సందర్భంగా పడవ బోల్తా పడింది. పడవలో 25 మంది మహిళలు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం అన్ని ఇతర పడవ పోటీలు నిలిపివేయబడ్డాయి. బోటు బోల్తా పడడంతో అందులో ఉన్న 25 మంది మహిళలు నీటిలో మునిగిపోయారు.
చంపకుళం పంచాయతీకి చెందిన కట్టిల్ తెక్కెతిల్ చుండన్, నేడుముడి పంచాయతీకి చెందిన స్నేక్ బోట్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే బోటు బోల్తా పడడంతో అందులో ఉన్న మహిళలు నీటిలో మునిగిపోయారు. స్థానిక మత్స్యకారులు, ఇతర చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: Land For Jobs Scam: భూ ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీట్‌లో తేజస్వి, లాలూ, రబ్రీ దేవి పేర్లు
కేరళలో పడవ పోటీలు శతాబ్దాల నాటి సంప్రదాయం. ఈ రేసులు తరచుగా కేరళ బ్యాక్ వాటర్స్ మీద జరుగుతాయి. ఈ పడవ పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారు. కేరళలో జరుగుతున్న వరుస పడవ ప్రమాదాలు జరుగుతుండగా.. తాజాగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2019లో అలప్పుజాలో పడవ పోటీల సందర్భంగా బోటు బోల్తాపడి 10 మంది చనిపోయారు. 2021లో కొల్లాంలో బోట్ రేస్‌లో పడవ బోల్తా పడి 14 మంది చనిపోయారు.
