Site icon NTV Telugu

Srinagar: జీలం నదిలో పడవ బోల్తా.. ఏడుగురు సేఫ్, ఇద్దరు మిస్సింగ్

Boat

Boat

దక్షిణ కాశ్మీర్‌లోని హతివారా పుల్వామాలోని జీలం నదిలో బుధవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది నీటిలో పడిపోయారు. కాగా.. అందులో ఏడుగురిని రక్షించారు, మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SDRF రెస్క్యూ సిబ్బంది వారి సామగ్రితో తప్పిపోయిన వ్యక్తుల కోసం రంగంలోకి దిగారు. నదిలో ఇసుక తీసేందుకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. పడవలో తొమ్మిది మంది కార్మికులు ఉండగా, వారంతా జమ్మూ కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. బోటు బోల్తా పడడంతో ఒడ్డున ఉన్నవారు వెంటనే సాయం కోసం కేకలు వేయడంతో వారిని రక్షించేందుకు కొంత మంది నదిలోకి దూకారు.

Parshottam Rupala: క్షత్రియ వర్గాన్ని క్షమాపణ కోరిన కేంద్రమంత్రి

నదిలో మునిగిపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. కాగా.. ఏడుగురు కార్మికులను రక్షించారు.. మరో ఇద్దరు తప్పిపోయారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న సీనియర్ SDRF అధికారి తెలిపారు. ఏడుగురు కార్మికులను రక్షించి ప్రథమ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారని.. వారి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. చీకటి ఉన్నప్పటికీ, రెస్క్యూ వర్కర్లు నదిలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.

Indian Economy: ప్రధాని మోడీ, అదానీ-అంబానీలు భారతదేశాన్ని “ఎకనామిక్ సూపర్ పవర్‌”గా మారుస్తున్నారు.. CNN నివేదిక

Exit mobile version