Delhi : ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (MCG) అవుట్‌గోయింగ్ కౌన్సిలర్, అతని గ్యాంగ్‌స్టర్ సోదరుడు, మరో 16 మందిపై రెండు కుటుంబాల మధ్య గొడవల కారణంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ధన్వాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి రక్తపు ఘర్షణ జరిగిందని, ఇందులో కనీసం ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ (పశ్చిమ) కరణ్ గోయల్ తెలిపారు. అలాగే ధన్వాపూర్ గ్రామంలో ఇరవై మందికి పైగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also:Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. తేదీని వెల్లడించిన అధికారులు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గంటపాటు బుల్లెట్లు పేలాయని, దీంతో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఓ గుంపు కూడా ఇద్దరు వ్యక్తులను వాహనంతో చితకబాదేందుకు ప్రయత్నించిందని తెలిపారు. అవుట్‌గోయింగ్ ఎంసీజీ కౌన్సిలర్ నవీన్ దహియా, అతని సోదరుడు, గ్యాంగ్ నాయకుడు సునీల్ అలియాస్ తోటతో కలిసి అతని పొరుగు దినేష్ దహియా, అతని కుటుంబంపై కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సునీల్ అలియాస్ తోట మూడు రోజుల క్రితం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. ఇసుక తవ్వకాలు, నీటి సరఫరా వ్యవహారంలో ఆదిపత్యం విషయంలో తోట, దినేష్ దహియా కుటుంబాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోందన్నారు.
Read Also:DC vs SRH: బౌలింగ్ చేయాలంటే బయమేసింది: ప్యాట్ కమిన్స్