Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. తేదీని వెల్లడించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త అందించింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 24న ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అదే రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను అధికారులు ఒకేసారి ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Read also: Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు
Also Read
దీంతో.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం నిర్వహించి ఏప్రిల్ 10న పూర్తి చేసి మార్కుల నమోదుతోపాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడుసార్లు జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తయింది. గతేడాది మే 9న ఫలితాలు ప్రకటించగా.. ఈసారి 15 రోజుల ముందే ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read also: Memantha Siddham: 20వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
ఫలితాలను ఇలా చూడొచ్చు..
* ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి- (tsbie.cgg.gov.in)
* అక్కడ మీరు హోమ్‌పేజీలో ‘TSBIE 2024 ఫలితం’ లింక్‌పై క్లిక్ చేయాలి.
* విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
* ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!