Shocking Incident : హైదరాబాద్ పాతబస్తీలోని ఐ.ఎస్. సదన్ ప్రాంతంలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసన చూసి స్థానికులు అనుమానం పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేటలో ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సంబంధిత ఇంటిని పరిశీలించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇంటి అంతా రక్తపుదారలు కనిపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
ఇంట్లో నుంచి వస్తున్న తీవ్ర వాసనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ టీమ్‌ను అక్కడికి రప్పించి సాంకేతిక సాక్ష్యాలను సేకరించారు. ఆ ఇంట్లో బీహార్‌కు చెందిన కొంతమంది యువకులు నివసిస్తున్నారని, స్థానికుల సమాచారం.
YS Jagan: రాష్ట్రాన్ని బీహార్ చేయాలని చూస్తున్నారు.. కావాలనే చెవిరెడ్డిని ఇరికించారు!
ఈ ఇంట్లో ఎలాంటి హత్య జరిగిందా? గాయపడిన వారు ఎవరైనా ఉన్నారా? లేదా ఇతర కారణాలివేనా అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలించి, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను కూడా సేకరిస్తున్నారు.
ఇక, ఆ ఇంటి యజమానుడు ఎవరు? యువకులు ఎక్కడికి వెళ్లారు? రక్తపు మచ్చలు ఎలా వచ్చాయి? అనే అంశాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన పాతబస్తీ ప్రాంతంలోని ప్రజల్లో భయాన్ని కలిగించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
