Site icon NTV Telugu

Ind vs NZ: భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా

Black Tickets

Black Tickets

Ind vs NZ 1st Odi: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు వెలువడుతున్నాయి. వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్‌కు చెందిన 20 టికెట్లు ఒక్కోటి రూ.3,000 అని.. కావాలంటే ఫలానా నంబర్లు సంప్రదించాలంటూ కేటుగాళ్లు పోస్టింగ్‌లు పెట్టారు. 1,500 టికెట్ను రెట్టింపు ధరకు బహిరంగంగా బ్లాక్ మార్కెట్‌లో కొన్ని ముఠాలు అమ్ముతున్నాయి. బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు నిఘా పెట్టారు.

భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌లో జరిగే తొలిపోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్ ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజుల పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచడంతో పూర్తిగా అమ్ముడుపోయాయి. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండడంతో టికెట్లు వెంటనే అమ్ముడుపోయాయి. ఈనెల 13న 6,000, 14న 7,000, 15న 7,000, 16న 9,417 టికెట్లను పేటీఎం ద్వారా హెచ్ సీఏ అమ్మకాలు జరిపింది.

Bharat Jodo Yatra: రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు పరిగెత్తుకొచ్చిన యువకుడు.. వీడియో వైరల్

ఈ సిరీస్‌కు ముందు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను తెలుసుకుందాం. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 6 వన్డేలు ఆడగా, ఈ కాలంలో మూడు మ్యాచ్‌లు గెలిచింది. భారత్‌లో ఇప్పటివరకు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మొత్తం 35 వన్డేలు జరగాయి. ఈ సమయంలో న్యూజిలాండ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా, టీమిండియా 26 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అక్కడ ఒక మ్యాచ్ రద్దయింది. అందుకు తగ్గట్టుగానే సొంతగడ్డపై భారత్‌పై అతడిదే పైచేయిగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా 2017లో భారత్‌లో వన్డే సిరీస్ ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

పాకిస్థాన్ పర్యటన నుంచి శనివారమే నేరుగా హైదరాబాద్ వచ్చిన కివీస్ జట్టు.. లంకతో వన్డే సిరీస్ తర్వాత నగరానికి చేరుకున్న టీమిండియా పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నాయి. ఈ సారి సొంత గడ్డపై హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ తొలిసారిగా ఆడనున్నాడు. గతంలో ఐపీఎల్‌లో ఆడినా అంతర్జాతీయ మ్యాచ్‌లో హైదరాబాద్‌లో ఆడే అవకాశం రాలేదు.

Exit mobile version