Site icon NTV Telugu

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి కీలక నిర్ణయం.. రేపటి నుంచి జోనల్‌ సమావేశాలు

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక, పనిలోకి దిగిపోయారు.. బాధ్యతలు స్వీకరించిన రోజే ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డా ఆమె.. మరోవైపు పార్టీ పటిష్టతపై ఫోకస్‌ పెట్టారు.. అందులో భాగంగా రేపటి నుంచి బీజేపీ జోనల్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.. జోనల్ సమావేశాలకు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి హాజరుకానున్నారు.. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు పురంధేశ్వరి.. జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి..

Read Also: Lahiru Thirimanne: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్

రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ.. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కోస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. కాగా, వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని పురంధేశ్వరి ధ్వజమెత్తిన విషయం విదితమే.. కార్పొరేషన్‌ల పేరుతో తెచ్చిన అప్పులు.. కార్పొరేషన్‌లకు కేటాయించడం లేదన్న ఆమె.. పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టడంతోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని.. అప్పులు చేసి సంపద సృష్టించే ఒక్క నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శలు గుప్పించిన విషయం విదితమే. మరోవైపు.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు పురంధేశ్వరి.. సరైన సమయంలో సరైన నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకుంటారని చెప్పారు. ‘‘జనసేన మా మిత్రపక్షం.. పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడా.. త్వరలో అవకాశం బట్టి కూర్చుని మాట్లాడుకుంటాం అని ఏపీ బీజేపీ చీఫ్ వెల్లడించిన విషయం విదితమే.

Exit mobile version