కరెంటు కోతలపై రాజస్థాన్‌లోని బూండీ జిల్లాలో సోమవారం తీవ్ర దుమారం చెలరేగింది. కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు, రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలతో అక్కడి జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో ప్రజలు ఆందోళన బాటపట్టారు. సోమవారం బూండీలో కరెంటు కోతలపై తీవ్ర దుమారం రేగింది. వాస్తవానికి విద్యుత్ కోతలు ఉండొద్దంటూ.. ట్రాన్స్‌ఫార్మర్లను మార్చద్దంటూ రైతులతో పాటు బీజేపీ కార్యకర్తలు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.
Chandra shekhar: నేను అమిత్ షాకి శాలువా కప్పితే దళితుడ్ని అంటూ నిరాకరించాడు..
బూండీ ఎస్‌డిఎం సోహన్‌లాల్ మాట్లాడుతూ.. కోట సీనియర్ ఇంజనీర్ గజేంద్ర బెర్వా ఆందోళనకారులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ అధికారులు మౌఖికంగా అంగీకరించారు. అయితే నిరసనకారులు రాతపూర్వకంగా డిమాండ్లను అంగీకరించడంపై మొండిగా ఉన్నారు. దీనిపై అధికారులు రాతపూర్వకంగా ఇవ్వలేమని సమాధానం ఇవ్వడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ఏం చెప్పారంటే?
మరోవైపు 72 గంటల్లో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తామని, సామాన్యులకు 24 గంటల గృహ, 8 గంటల వ్యవసాయ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత రూపేష్ శర్మ అన్నారు. గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు, విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న రైతు వరిపంటకు సరిపడా రోజులలో త్రీఫేజ్ కరెంటు, గ్రామంలో 24 గంటల కరెంటు అవసరమని బిజెపి నాయకుడు అన్నారు.