BJP Vishnuvardhan Reddy : సీపీఎం వ్యాఖ్యలపై విష్ణువర్థన్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఇటీవల సీపీఎం నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి కౌంటర్ వేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం సీపీఎంకు తగదన్నారు. సామాజిక న్యాయం ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ముర్మును బలపరుస్తోందని, ఒక గిరిజన మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపితే సీపీఎం విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. దేశంలో ఎప్పుడో భూస్థాపితమైన, సీపీఎం నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే సీపీఎం విమర్శలు చేస్తోందని, సీపీఎం మహిళా, గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్నారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న ఎన్డీయేను విమర్శించే అర్హత కమ్యూనిస్టు నాయకులకు ఏమాత్రం లేదన్నారు. ఎన్డీఏయేతర పక్షాలైన జార్ఖండ్ జేఎంఎం పార్టీ నేత హేమంత్ సోరెన్, ఒరిస్సా బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ ,కర్ణాటక జనతాదళ్ (యస్) దేవేగౌడ గారు ఇంకా అనేక పార్టీలు మద్దతు ఇస్తున్న విషయాన్ని కమ్యూనిష్టులకు కనపడలేదా..? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవి ఎన్నికలను సైతం వామపక్షాలు రాజకీయం చేయడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు