NTV Telugu Site icon

BJP Vishnuvardhan Reddy : రేపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న పురందేశ్వరి

Vishnu Vardhan Reddy

Vishnu Vardhan Reddy

బీజేపీ అధిష్టానం ఇటీవల తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు 11 గంటలకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు.

Also Read : Opposition meet: విపక్షాల సమావేశానికి సోనియా.. 24 పార్టీలకు ఆహ్వానం!

రాబోయే ఎన్నికలు పురందేశ్వరి నాయకత్వంలో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. 16వ తేదీ ఎన్నికల కార్యాచరణపై ముఖ్య సమావేశం ఉందని, వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యాచరణను కూడా అదే రోజు ప్రకటిస్తామని విష్ణువర్థన్‌ తెలిపారు. మెడికల్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం జీవో ఉందని, తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులకు చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆస్తులు, మెడికల్ విద్యార్దుల విషయంలో తెలంగాణ చేస్తున్న మోసాన్ని ఎందుకు ఆంధ్ర ముఖ్యంమత్రి పట్టించుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాల్ని ముంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : Opposition meet: విపక్షాల సమావేశానికి సోనియా.. 24 పార్టీలకు ఆహ్వానం!

అంతేకాకుండా.. ‘ఆంధ్ర కు అన్యాయం చేస్తున్న BRS ను మహారాష్ట్రలో అడగరా.. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ పణంగా పెడుతున్నారు… అంగన్వాడీలకు జీతం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.. రింగింగ్ చేసి గెలించిన పార్టీ ప్రతినిధులే ఉద్యమం చేస్తున్నారు.. కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులు కూడా ప్రభుత్వం వాడేస్తుంది… సర్పంచులు కేవలం కీలు బొమ్మలు మాత్రమే.. గ్రామా సర్పంచుల సమస్యలకు సంఘీబావం తెలియచేస్తున్నాం… ఓటు విలువ ఎమ్మెల్యే ,ఎంపీలకు మాత్రమేనా .. సీఎం కె చెక్ పవర్ లేదు సర్పంచ్ కు ఉంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.