Site icon NTV Telugu

BJP: ఢిల్లీలో రేపటి నుంచి రెండ్రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు

Bjp

Bjp

BJP National Council meeting: భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జాతీయ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11, 500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 17) ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం కాబోతుంది. ఉదయం జరిగే ఈ మీటింగ్ లో ప్రధాని మోడీతో సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర పార్టీ అతిరథ మహారధులు పాల్గొననున్నారు. అలాగే, రేపు (ఫిబ్రవరి 17) మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో రెండు రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభం అవుతాయి.

Read Also: Ooru Peru Bhairavakona X Review: ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమా హిట్ కొట్టినట్లేనా?

ఇక, ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గం సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నిర్దేశించుకున్న 370 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు 400 స్థానాలకు పైగా ఎన్డీయే కూటమి గెలుస్తుందనే పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక, బీజేపీ విధానాలు, దేశహితం, సాధించిన దేశ పురోగతి, దేశ సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్ళు, లక్ష్యాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు.

Read Also: Sovereign Gold Bond : రూ.500ల తగ్గింపుతో చౌక బంగారం కొనేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్

అయితే, రాజకీయ, సామాజిక, ఆర్ధిక, అంతర్జాతీయ సత్సంబంధాలు లాంటి అంశాలపై విస్తృతంగా చర్చించి తీర్మానాల ద్వారా ఆమోదం తెలిపనున్నారు. 10 ఏళ్ళు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు.. తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో భారత దేశం సాధించిన ప్రగతితో ఆవిష్కృతమైన “వికసిత్ భారత్”కు హాజరైన ప్రతినిధులకు వివరించనున్నారు. ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపి నడ్డా ప్రారంభోపన్యాసంతో రెండు రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభం కానుండగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముగింపు ఉపన్యాసంతో పరిసమాప్తం కానున్నాయి. ఇవాళ రాత్రి వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు, పార్టీ నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు.

Exit mobile version