NTV Telugu Site icon

Swamy Goud: బీజేపీకి స్వామి గౌడ్‌ బై..బై.. సీఎం కేసీఆర్‌తో భేటీ

Swamy Goud Kcr

Swamy Goud Kcr

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. నాయకులు పార్టీలు మారుతుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రీకృతమై ప్రస్తుత రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ ఆ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి ఆ పార్టీ నష్టనివారణ చర్యలు దిగినట్లు కనిపిస్తోంది.

Also Read : Komatireddy Venkat Reddy Audio Call Leak: ఎంపీ కోమటిరెడ్డి ఆడియో లీక్‌… తమ్ముడి కోసం రంగంలోకి..!

ప్రత్యర్థ పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే మునుగోడు మహిళ ఎంపీపీ పల్లె రవి దంపతులు టీఆర్‌ఎస్‌లోకి చేరిపోగా.. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేత స్వామి గౌడ్‌ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మండలి ఛైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్… ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే.. ఆయన నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. ఇక బీజేపీ స్వామి గౌడ్‌ బై..బై.. చెప్పేసి.. రేపో మాపో గులాబీ గూటిలో చేరిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.