NTV Telugu Site icon

Gujarat Elections: ఎన్నికల ముంగిట బీజేపీ కీలక నిర్ణయం.. ఏడుగురు రెబల్స్‌పై వేటు

Bjp

Bjp

Gujarat Elections: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ప్రధాని మోడీ, అమిత్‌ షాతో సహా అగ్రనేతలంతా ఆ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్‌ పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నుంచి టికెట్ దక్కని ఏడుగురు రెబల్స్‌గా నామినేషన్ వేసి బరిలో నిలిచిన వారి బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వీరిపై బీజేపీ వేటు వేసింది. కాషాయ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ఎమ్మెల్యేలను ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ను ఉటంకిస్తూ బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. బీజేపీ అధిష్టానం బీఫాం ఇవ్వలేదని కొందరు బీజేపీ నేతలు రెబల్స్‌గా నామినేషన్ వేశారు. వారిని బుజ్జగించినప్పటికీ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవటంతో తిరుగుబాటుదారులపై బీజేపీ ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంది. పార్టీపై తిరుగుబాటు చేసిన ఏడుగురు నేతలను గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ బహిష్కరించారు.

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా పేర్లు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు పార్టీనుంచి వీరిని బహిష్కరించినట్లు రాష్ట్ర పార్టీ అధిష్టానం తెలిపింది. టికెట్ రానివారిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అరవింద్ లడానీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బుజ్జగించిన తరువాతకూడా ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. వాఘోడియా నుంచి బీజేపీ టికెట్‌పై ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గుజరాత్‌లో ఏడోసారి అధికారాన్ని కోరుతున్న బీజేపీ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 160 మంది అభ్యర్థులతో మొదటి భాగాన్ని ప్రకటించిన కాషాయ పార్టీ 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది. పలువురు పార్టీ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌లకు టిక్కెట్లు నిరాకరించారు.

Salu Dora Selavu Dora Digital Board: మళ్లీ వెలసిన ఫెక్సీలు.. సాలుదొర సెలవు దొర అంటూ డిజిటల్‌ బోర్డు

2017 గుజరాత్ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 99 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. పార్టీ గత 27 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, 2014లో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడటానికి ముందు నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి ప్రధాని మోదీ, అమిత్‌ షా, సీఆర్‌ పాటిల్‌ నేతృత్వంలోని పార్టీ అత్యధిక సీట్ల సంఖ్య 140కి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. రాష్ట్రం చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. ఏడోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ దృష్టి పెట్టింది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ ఫలితాల తేదీతో పాటు డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Show comments