Site icon NTV Telugu

BJP President: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం!

Bjp

Bjp

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ విజయవాడలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు.

పాకా సత్యనారాయణ మాట్లాడుతూ… ‘అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. రేపు అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుంది. 30న ఉదయం 11 నుంచి 1 వరకూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 30న మధ్యాహ్నం 1 నుంచి 2 వరకూ నామినేషన్ల స్క్రూటిని నిర్వహిస్తారు. సాయంత్రం 4 లోపు ఉపసంహరణకు గడువు. జూలై 1న అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. జాతీయ కౌన్సిల్ పీసీ మోహన్ ఎన్నికల అబ్జర్వర్‌గా ఉంటారు’ అని చెప్పారు.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. 90 వేలకు దిగొచ్చిన బంగారం!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి, కిషన్ రెడ్డిలు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్నారు.

Exit mobile version