Site icon NTV Telugu

BJP-SAD alliance: బీజేపీకి గట్టి షాక్.. పొత్తు లేదని తేల్చి చెప్పిన సుఖ్బీర్ సింగ్

Bjp Sad

Bjp Sad

BJP-SAD alliance: పంజాబ్‌ రాష్ట్రంలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. గత లోక్‌ సభ ఎ‍న్నికల్లో బీజేపీతో కలిసి నడిచిన శిరోమణి అకాలీ దళ్‌ (SAD).. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా లేదని తేల్చి చెప్పింది. పంజాబ్‌ అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ 13 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించింది. అలాగే, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటూ వచ్చిన ఊహాగానాలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Read Also: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ అవుట్‌!

అయితే, అకాలీదళ్‌ 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్‌- బీజేపీలు రెండేసి స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఈ సారి లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ- అకాలీదళ్‌ కూటమి సీట్లపై ప్రకటన ఉండనుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే అంశంపై ఎస్‌ఏడీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. పొత్తు, సీట్ల ఒప్పందాల గురించి తనకే తెలియదని స్పష్టం చేశారు.. ఇలాంటి ఊహాగానాలు కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తు మాత్రమే కొనసాగించేందుకు తమ పార్టీ ఇంస్ట్రెట్ గా ఉందని తెలిపారు.

Read Also: Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..

ఇక, కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై శిరోమణి అకాలీదళ్‌ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. సెప్టెంబర్ 2020లో ఎన్‌డీఏ నుంచి ఆ పార్టీ నిష్క్రమించింది. ఆ తర్వాత వ్యవసాయ చట్టాల్ని కేంద్ర సర్కార్ క్యాన్సిల్ చేసింది. అయితే, మరోసారి ఇప్పుడు ఆ రెండు పార్టీల కూటమి అంశం తెరపైకి వచ్చింది. మరి దీనిపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది.

Exit mobile version