NTV Telugu Site icon

BJP: ముస్లిం ఓట్ల కోసమే ప్రియాంక గాంధీ అలా చేశారు!

Priyanka Gandhi

Priyanka Gandhi

పార్లమెంట్‌ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె బ్యాగ్ వేసుకుని రావడాన్ని ముస్లింల బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఎంపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆమె పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది.. కానీ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాల గురించి ఆమె స్పందించలేదని ఆరోపించింది. ముస్లింల బుజ్జగింపు విధానం కారణంగా కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని విమర్శించింది.

READ MORE: TG Cabinet: భూమిలేనివారికి రూ.6 వేలు.. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ప్రియాంక గాంధీ కూడా బీజేపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బీజేపీ ఆలోచనను పితృస్వామ్యమని అభివర్ణించిన ఆమె.. తాను ఎలాంటి దుస్తులు ధరించాలో, నా బ్యాగ్ ఎలా ఉండాలో ఎవరూ నిర్ణయించలేరని అన్నారు. పనికిమాలిన వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై బీజేపీ దృష్టి సారించాలని, ప్రజల వేషధారణపై కాదన్నారు. తాము బంగ్లాదేశ్‌ ఘటనపై స్పందించినట్లు తెలిపారు.

READ MORE:BJP: రేపు ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ

అంతకుముందు… బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆమెకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు చేయడం మాత్రమే ఆసక్తి అని అన్నారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆధునిక యుగానికి చెందిన ముస్లిం లీగ్ అని బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా అన్నారు. ప్రియాంక తమను కాపాడుతుందని కాంగ్రెసోళ్లు ఆలోచిస్తున్నారు.. ఆమె రాహుల్ గాంధీ కంటే పెద్ద డిజాస్టర్ అని తీవ్రంగా విమర్శించారు.

Show comments