NTV Telugu Site icon

BJP Manifesto: బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..

Bjp Manifesto

Bjp Manifesto

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్‌ పత్రను రూపొందించినట్లు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. దీని కోసం 15 లక్షల సలహాలు, సూచనలను ఈ కమిటీ పరిశీలించింది.

Read Also: Peddireddy Ramachandra Reddy: ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం జగన్‌పై దాడి చేశారు..

అయితే, ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ జయంతి రోజు సంకల్ప్‌ పత్ర విడుదల సంతోషదాయకం అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ ఆకాంక్షలను అమలు చేస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్‌ అని చెప్పారని నడ్డా గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుంది.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే దేశ ప్రగతి సాధ్యం.. మోడీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని జేపీ నడ్డా వెల్లడించారు.

Read Also: Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..

ఇక, గ్రామాలకూ ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామన్న జేపీ నడ్డా.. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని తెలిపారు. పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తున్నామన్నారు. ‘పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే మా లక్ష్యం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా నినాదం అని ఆయన చెప్పుకొచ్చారు. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం, అలాగే, అయోధ్యలో రామ మందిర్‌ నిర్మాణాన్ని పూర్తి చేశాం.. ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు మంచి చేశాం.. మహిళల రిజర్వేషన్‌ చట్టాన్ని తెచ్చాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొని.. 9 నెలల్లోనే వ్యాక్సిన్‌ తయారు చేశాం.. కరోనా వ్యాక్సిన్‌ను వంద దేశాలకు ఎగుమతి చేశామన్నారు. ఆయుష్మాన్‌ భారత్ ద్వారా 50 కోట్ల మందికి మేలు చేకూర్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.