NTV Telugu Site icon

MP Laxman: దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు..

Laxman

Laxman

కాంగ్రెస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బై వన్, గేట్ వన్ రాజకీయాలు బీజేపీ పాలనలో ఉండవని అన్నారు. దేశ సంపద ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్‌ది అని ఆరోపించారు. దేశ సంపదకు ప్రతి పౌరుడు అర్హుడు అనే విధానాలు బీజేపీది.. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేయదని తెలిపారు. దేశ భక్తి, అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది.. 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుందని లక్ష్మణ్ అన్నారు. దేశం బీజేపీ పాలన వైపుకు చూస్తోంది.. బీజేపీపై ప్రగాఢమైన విశ్వాసంతో దేశ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అడ్డదారులు తొక్కే పార్టీ బీజేపీ కాదు.. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. జనవరి చివరి లోపల రాష్ర్ట జాతీయ అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని లక్ష్మణ్ తెలిపారు.

Kamal Haasan: పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నా

కాంగ్రెస్ ఎంత విషపూరితమైన ప్రచారం చేసినా.. దేశ ప్రజలు మోడీని మూడోసారి గెలుపించుకున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రజా సంక్షేమ ప్రతిఫలాలు నేడు ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు అందుతున్నాయి.. నాటి కాంగ్రెస్ పాలనకు నేటి బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు, వన్ నేషన్, వన్ ఎలెక్షన్ సాహసోపేతమైన నిర్ణయాలు అని తెలిపారు. దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ ఫలాలు కింది స్థాయి ప్రజలకు అందించాలనే తపనతో మోడీ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి సంస్థాగత నిర్మాణం ముఖ్యమైనది.. సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్నందుకే గుజరాత్ లో గత 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నామన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాంటి పటిష్ఠమైన సంస్థాగత నిర్మాణం ప్రతి రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది.. జరగాలని లక్ష్మణ్ చెప్పారు.

Parenting Tips : మీ పిల్లలు మాట వినట్లేదా? వారిని కొట్టకుండా మార్చే టిప్స్ ..

మహారాష్ట్ర, జార్ఖండ్ లో కచ్చితంగా బీజేపే అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. మరోవైపు.. రాహుల్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడారని ఆరోపించారు. కులగణన దేశానికి మోడల్ కాదు.. చీటింగ్ అని తెలిపారు. కాంగ్రెస్ బూటకపు మాటలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సీతారామ్ కేసరి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు అధ్యక్షులు కావాలంటే నెహ్రూ అనే తోక కావాలి.. అదే బీజేపీలో సామాన్య పౌరుడు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని లక్ష్మణ్ అన్నారు. రాజకీయ అవకాశాలు సమానత్వంగా ఇచ్చే ఏకైక పార్టీ దేశంలో బీజేపీనేనని పేర్కొన్నారు. బీజేపీకి పదవులు ముఖ్యం కాదని.. బాధ్యతలు ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.. 2040 వరకు వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేననే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు వెళ్ళాలని లక్ష్మణ్ సూచించారు.

Show comments