NTV Telugu Site icon

Kishan Reddy : పేద ప్రజల సంక్షేమాన్ని ఛిద్రం చేయడమే ప్రజా పరిపాలన లక్ష్యమా..?

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్నాం పేదల ఇండ్లను కూల్చోద్దు అని ఆయన అన్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మూసీ సుందరీకరణ ను తెర మీదకు తెచ్చారని, సిగ్గులేకుండా ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లను కూల్చుతోందన్నారు కిషన్‌ రెడ్డి. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే రాబోవు కాలంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇండ్లను కూల్చితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కిషన్‌ రెడ్డి.

Maharashtra Assembly Elections: టెంపోలో రూ.138 కోట్ల విలువైన బంగారం.. ఎలా గుర్తించారు?

ఏ పోలీసులు ఏ లాఠీలు అపలేవని గుర్తుంచుకోవాలని, ప్రజలకు నష్టం జరగకుండా మూసీ సుందరీకరణ జరగాలన్నారు కిషన్‌ రెడ్డి. ప్రజలకు అన్యాయం జరిగితే ఉపేక్షంచలేదని, కేసీఆర్ మూసీలో కొబ్బరి నీళ్లు పారించారు తాగారు వెళ్లారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు మూసి సుందరీకరణ అంటున్నారన్నారు కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం కాంగ్రెస్ లక్ష్యమా..? పేద ప్రజల సంక్షేమాన్ని ఛిద్రం చేయడమే ప్రజా పరిపాలన లక్ష్యమా..? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇండ్లు కూల్చేస్తారని భయపడి గుండె నొప్పితో చనిపోతున్నారని, మూడు నెలలుగా మూసి ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయంతో బ్రతుకుతున్నారన్నారు కిషన్ రెడ్డి. మూసీ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని, మూసీ ప్రజల జీవితలకు బీజేపీ భరోసా ఇస్తోందన్నారు కిషన్‌ రెడ్డి.

IND vs NZ 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్