NTV Telugu Site icon

JP Nadda: బెంగాల్ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు..

Jp Nadda

Jp Nadda

JP Nadda: పశ్చిమ బెంగాల్‌లో ఓ జంటపై జరిగిన దాడిపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే దీదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఎక్స్‌ వేదికగా నడ్డా స్పందించారు.. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది అని ప్రస్తావించారు. మతం పేరుతో చేస్తున్న క్రూరత్వానికి ఇది నిదర్శనం అంటూ ఆయన మండిపడ్డారు. దీనిని వ్యతిరేకించడానికి బదులు తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. సందేశ్‌ఖాలీ, ఉత్తర దినాజ్‌పూర్ ఇలా ఏ ప్రాంతాల్లోనూ మహిళలకు తగిన భద్రత లేదు అని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.

Read Also: INDIA Bloc: నీట్‌పై పార్లమెంట్లో మళ్లీ గందరగోళం.. లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్..

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా బెంగాల్‌లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో వెదురుకర్రతో ఓ జంటను ఇష్టం వచ్చినట్లు కొడుతున్న వ్యక్తి ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలోని చోప్రా ప్రాంత టీఎంసీ నేత తాజ్‌ముల్‌ అలియాస్‌ జేసీబీగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసేశారు. సుమోటోగా కేసు నమోదుచేసిన పోలీసులు బాధిత జంటకు రక్షణ కల్పించినట్లు వెల్లడించారు.