Site icon NTV Telugu

TBJP: “ఇది క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ఠ”.. రాజా సింగ్ రాజీనామాపై బీజేపీ సంచలన ప్రకటన..!

Raja Singh

Raja Singh

Raja Singh:బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికలలో రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చారని తెలిపింది. ఆ సమయంలో విషయమై జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ చర్చించారు. ఇక రాజాసింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారని తెలిపింది.

Read Also:BSNL: ఫ్లాష్ సేల్.. రూ.400కే 400GB డేటా.. త్వరపడండి..!

అలాగే రాష్ట్ర ఎన్నికల అధికార శోభా కరండ్లాజేకి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ సమర్పించవలిసి ఉండగా, వారు కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధన ప్రకారం.. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయడానికి 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించవలిసిందిగా శ్రీమతి శోభా కరండ్లాజే రాజాసింగ్ కోరారు. అయితే, రాజాసింగ్ నామినేషన్ కి మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసి పార్టీ పోటీ చేయనివ్వట్లేదని అబద్ధాలతో పార్టీపై అభాండాలు వేస్తున్నట్లు తెలిపింది. పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని ఆయన జాతీయ అధ్యక్షుడికి పంపించడం జరుగుతుందని తెలిపింది.

Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!

రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించాలని, పార్టీకంటే ఎక్కువ ఎవరూ కాదని బీజేపీ పార్టీ పేర్కొంది. గతంలో కూడా ఇలాంటి క్రమశిక్షణారాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని.. ప్రధానమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు వారి నియోజకవర్గానికి వచ్చినా సరే వారి కార్యక్రమాలకు హాజరుకాకుండా పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా ఉంది రాజాసింగ్ వ్యవహారమని పార్టీ తెలిపింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. పార్టీ క్రమశిక్షణను అనేకసార్లు రాజాసింగ్ ఉల్లంఘించినట్లు తెలిపింది. చివరకు ఈరోజు వారే రాజీనామా చేసారని పార్టీ ప్రకటించింది.

Exit mobile version