Kishan Reddy : బీజేపీ- బీఆర్‌ఎస్ పొత్తు అంశంపై స్పందించిన కిషన్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు..!
- మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదు
- కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఎన్ని తిట్టినా పోయేదేమీ లేదు
- రెండు పార్టీలో ఒప్పందం మేరకు దాడి చేస్తున్నాయ్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్- బీజేపీ పొత్తు అంశంపై కిషన్‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ.. ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు. కేసీఆర్ కుటుంబ కలహాలు వాళ్ళు తేల్చుకోవాలని… ఎవరు ఎక్కువ దోచుకొన్నారు… దోచుకున్నది పంచోవడం పైనే ఆ కుటుంబంలో ఘర్షణ మొదలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని.. కవిత చిప్ప మాకు అవసరం లేదు… ఆమె గురుంచి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఏందో తెలుసన్నారు.
READ MORE: US Report: భారత ప్రథమ శత్రువు చైనా, తర్వాతి స్థానంలో పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
హరీష్ రావు కాంగ్రెస్ దగ్గరగా ఉన్న వ్యక్తి అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. “విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా ఇస్తుంటే ఎందుకు అడగలేదు. కేసీఆర్ చెప్పాలి.. ఎందుకు విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్ట్ పెట్టాలని డిమాండ్ చేయలేదు.. సోనియా దేవత అని పోయి కాళ్ళు పట్టుకున్నారు కదా… తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం పని చేస్తాం.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాం. హరీష్ రావు నీ సూచనలు కేటీఆర్, కవిత లకు చెప్పుకో.. అప్పుడు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిన అవినీతి పార్టీ… దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కోరాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేస్తున్న.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: BJP MP Laxman: ఏపీలో జగన్, షర్మిల.. తెలంగాణలో కేటీఆర్, కవిత సీన్లు ఒక్కటే..!
ఆపరేషన్ సిందూర్ విషయంలో బాధ్యత రహితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. పాకిస్థాన్ సైనికుల మాట కాంగ్రెస్ మాట్లాడుతుందని… కేసీఆర్ హయంలో జరిగిన అవినీతిని ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళాలి చెప్పాలన్నారు. అవినీతి కి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని… ఈటెల రాజేందర్ కాళేశ్వరం విషయంలో ఏమీ తెలిసిన చెప్పాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!