Site icon NTV Telugu

BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!

Bjp National President

Bjp National President

BJP National President: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 19న పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్లు దాఖలు చేస్తారు. మరుసటి (జనవరి 20న) రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ లేకుండానే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మరే ఇతర నాయకుడు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపించడం లేదు.

READ ALSO: UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి

బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ విడుదల చేసిన సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణ ఉంటుంది. అవసరమైతే జనవరి 20న ఓటింగ్ జరుగుతుందని లక్ష్మణ్ తెలిపారు. ఆ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నబిన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ నాయకత్వం అంతా ఆయన నామినేషన్‌కు మద్దతు ఇస్తున్నారు.

నిజానికి గతంలో కూడా జేపీ నడ్డా కూడా మొదట జూన్ 2019 లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అనంతరం జనవరి 20, 2020 న అమిత్ షా స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నితిన్ నబిన్ నేపథ్యం ఏమిటంటే..
దివంగత బీజేపీ ప్రముఖుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు.. ఈ 45 ఏళ్ల నితిన్ నబిన్. ఇతనికి పార్టీలో బలమైన సైద్ధాంతిక నేపథ్యం, సంస్థ పట్ల లోతైన నిబద్ధత కలిగిన డైనమిక్ నాయకుడిగా పేరుంది. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చారు. నబిన్ ప్రస్తుతం బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్ ప్రభుత్వంలో ఈయన రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు.

READ ALSO: స్టైల్‌తో పాటు సౌండ్ కూడా.. Xiaomi Mijia Smart Audio Glasses గ్లోబల్‌గా లాంచ్..!

Exit mobile version