BJP Muralidhar Rao : ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ పార్టీ నేత హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజలు ఒప్పుకోరన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఎలా అంటారని, బూతుల పార్టీ బీఆర్‌ఎస్ అవకాశం దొరికితే బూతు డిక్షనరీ ఓపెన్ చేయాల్సిన దుస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదని, హరీష్ రావు, ఆయన మామ పుట్టక ముందు, కాంగ్రెస్ పుట్టక ముందే హైదరాబాద్ ధనిక నగరంగా ఉందన్నారు.
అంతేకాకుండా.. ‘పొలిటికల్ ప్రాముఖ్యత కలిగిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం నిజాం కంటే ముందు కూడా ఉంది. 450 సంవత్సరాలకు పైగా వ్యాపారాలకు, కళలకు మారుపేరు హైదరాబాద్. హైదరాబాద్ పై చర్చకు హరీష్ సిద్దంగా ఉన్నారా ? బీఆర్‌ఎస్ పుట్టకకు హైదరాబాద్ కు సంబంధం లేదు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు కష్టపడితే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ముంబై కన్నా తెలుగు సినిమా నిర్మాణం వేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది.. దీంట్లో BRS ప్రభుత్వ పాత్ర ఎంటి ? వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారడంలో BRS పాత్ర ఎంటి ? ఐటీ ఉత్పత్తుల్లో BRS పాత్ర ఎంటి ? హైదరాబాద్ లో BRS మాఫియా సామ్రాజ్యం పోతే ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. బీఆర్‌ఎస్ పాలనలో చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి. రియల్ ఎస్టేట్ మాఫియాతో దేవాలయాల భూములు కబ్జాలు చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గతంలో పార్టనర్స్.. భవిష్యత్ లో పార్టనర్స్ వ్యవసాయ మోటార్ల సంఖ్య గతంలో 18 లక్షలు కాగా.. ఇప్పుడు 25 లక్షలకు పెరిగింది. సాగునీరు పెరిగితే బోర్లు.. వ్యవసాయ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగింది ? బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కరెంట్ పై అనవసర చర్చతో అసలు విషయాలపై చర్చ రాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. హమాస్ ఉగ్రవాద ఘటనను ఖండించింది ప్రధాని మోడీ. హైదరాబాద్ లో హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ర్యాలీ తీస్తుంటే బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుంది. హమాస్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటే భారత దేశంలో స్థానంలో లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హమాస్ రాజకీయాలకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి, హింసకు మద్దతుగా ర్యాలీలు తీస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది.? బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతుగా ర్యాలీలు ఉండవు హమాస్ ను ఖండిస్తూ.. కేసీఆర్ ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. బీజేపీ అన్నీ అంశాలతో చార్జిషీట్ విడుదల చేస్తాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే.’ అని మురళిధర్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!