రాజకీయాలను శాసించే ది ప్రజలు కానీ నాయకుల గ్రూప్ కాదన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి మురళి ధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రెండు సార్లు బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ప్రజలు అనుకున్నారు.. ఓటు వేశారు … రెండు సార్లు ఆ పార్టీ అవిరి అయిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారు తప్ప… పక్క రాష్ట్రాలను చూసి కాదని ఆయన అన్నారు. ఈ నెల 15 న అమిత్ షా బహిరంగ సభ అని, భద్రాచలం రాముల వారిని అమిత్ షా దర్శించుకోనున్నారని ఆయన వెల్లడించారు.
Fire Accident : పాశమైలారంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
అంతేకాకుండా.. ‘హైదరాబాద్ లో పార్టీ పూర్య కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో భేటీ కానున్న అమిత్ షా. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవ ఉత్సవాలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన సుపరిపాలన ఏంటి? రాజకీయ స్వలాభం, ఎన్నికల ప్రచారంలో భాగమే కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతారు. కేసీఆర్ పాలనలో జవాబుదారీతనం లేదు. దేశంలో బ్యాడ్ గవర్నెన్స్ కు సింబల్ తెలంగాణ. డబుల్ బెడ్ రూం పథకం అనేది ఒక బ్లాక్ షిఫ్ ప్రోగ్రాం. ల్యాండ్ సెటిల్మెంట్ల కోసమే ధరణిని తీసుకొచ్చారు. ధరణితో ఇబ్బంది పడుతున్న వారి కోసం మీరేమైనా పరిష్కారం చూపారా? పోడు భూముల సమస్య మాటేమిటి? దళిత బంధు లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలెందుకు లేవు? తెలంగాణ ప్రభుత్వంపై 18వేల కోర్ట్ ఆఫ్ కంటెప్ట్ కేసులు ఉన్నాయి.
Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..
సామాన్య ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశం లేదు. దీన్ని ఒక పోలీస్ కోటల మార్చారు. అదేమైనా నిజాం రాజు భవనామా? ఆర్టీఐ ను పనికి రాని వ్యవస్థ గా మార్చారు. యూనివర్శిటీ లో 70 శాతం ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో పోస్ట్ ప్లేస్ ను బట్టి ప్రతి ట్రాన్స్ఫర్ కు రేట్ కార్డ్ ఉంది. ఇదొక్క ఆర్గనైజ్డ్ కరప్షన్. కేసీఆర్ డ్రెస్ సెన్స్ మార్చారు.. ఆయన టోపీతో జనాలకి టోపీ పెడుతున్నారు. తెలంగాణలో మేము అనేక ఉద్యమాలు చేసాం. ఇక్కడ చేసిన ఉద్యమాలు మేము ఇంకే రాష్ట్రంలో చేయలేదు. మా నాయకుల మధ్య ఏటువంటి విబేధాలు లేవు. మాకంటూ ఒక్క అధ్యక్షుడు ఉన్నాడు..ఆయనే కిందే మేమంతా పని చేస్తాం. ఇవన్నీ మీడియా సృష్టిలో భాగమే. కేసిఆర్ ను గద్దె దింపడమే…మా అందరి లక్ష్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
