Site icon NTV Telugu

MP Tejaswi Surya: బీజేపీ ఎంపీ ఫోన్ హ్యాక్.. డబ్బులు, వజ్రాలు కావాలంటూ కాల్స్..

Mp Tejasvi Surya

Mp Tejasvi Surya

బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన మొబైల్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, వజ్రాలు కావాలంటూ గుజరాత్‌లోని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాయకుడికి తేజస్వి సూర్య ఫోన్ నుంచి కాల్స్ వెళ్లినట్లు ఆ ఫిర్యాదులో ఎంపీ తేజస్వీ పీఏ ప్రకాశ్ పేర్కొన్నారు.

Also Read: Ram Gopal Varma: జై బాలయ్య అంటున్న రామ్ గోపాల్ వర్మ

ఎంపీ తేజస్వి సూర్య బిజీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ తన దగ్గర మాత్రమే ఉంటుందని బానోతు ప్రకాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీకి వచ్చే కాల్స్‌కు మాత్రమే తాను సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. అయితే.. బీజెవైఎం గుజరాత్ అధ్యక్షుడు ప్రశాంత్ కొరాటేకు కాల్ రావడంతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను అప్రొచ్ అయ్యాడు. దీంతో తాను అలాంటి కాల్స్ ఏమి చేయలేదు.. అయినా.. నేనేందుకు డబ్బులు, వజ్రాలు అడుగుతాను అని తేజస్వి సూర్య చెప్పాడంతో ప్రశాంత్ కొరాటే షాక్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Singareni : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్

దీంతో తేజస్వి మీ మొబైల్ ఫోన్ నుంచి కాల్ వచ్చిందని బీజైవైఎం అధ్యక్షుడు చెప్పాడు.. తనను డబ్బు, వజ్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు.. తన ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ సూర్య తన.. పర్సనల్ సెక్రెటరీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఐటీ యాక్ట్ సెక్షన్ 66(సి)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విచారణ చేస్తున్నారు. తన ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లను వదిలే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చెప్పారు.

Exit mobile version