Site icon NTV Telugu

BJP MPs: ” ఇది పాకిస్థాన్‌ పనే” ఉగ్రవాద ఘటనపై బీజేపీ ఎంపీల రియాక్షన్..

Bjp

Bjp

వర్గం పేరు అడిగి దాడి చేయడాన్ని సభ్య సమాజం ఖండిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్‌లో అసమర్థ నాయకత్వం ఉందని.. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ నిప్పులు పోస్తుందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. భారత్‌ను దెబ్బతీయాలని పాక్ చూస్తే అది ఆ దేశ పొరపాటే అన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్య అని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

READ MORE: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి!

మరోవైపు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ అంశంపై స్పందించారు. “దేశ అభివృద్ధి చూడలేక పాక్ భారత్ ను దొంగ దొబ్బ తీసింది. కశ్మీర్ సంస్కృతిని కాపాడేందుకు మోడీ చేస్తోన్న ప్రయత్నం అడ్డుకునేందుకు కుట్ర చేసింది. పాక్ ఉగ్రవాద చర్యలకు మానుకోకపోతే.. ప్రపంచ దేశాలు పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించడం ఖాయం. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను ఏరి వేయాలి. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఘాతుకం జరిగినప్పుడు నిన్న నేను శ్రీనగర్‌లో ఉన్నాను. పాక్ దొంగ దెబ్బలు దేశ ప్రజలంతా ఖండించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Terror Attack: పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీగా సైన్యం, వైమానిక విమానాలు? ఈ వార్తలో నిజమెంత?

“బాధిత కుటుంబాలకు ప్రగడ సానుభూతి. దాడికి పాల్పడ్డ వారికి మూల్యం తప్పదు. పాక్ కుట్రలో బాగానే దాడి జరిగింది. హిందువుల అని అడిగి మరి దాడి చేయడం దుర్మార్గమైన చర్య. టెర్రరిజం ఎక్కడున్నా అంతం చేయాలి. ఇదొక్క పిరికి పంద చర్య” అని ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. నిన్నటి దాడి భారత్ ఐక్యత పై జరిగిందని.. దీని పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఇజ్రాయెల్ టూరిస్ట్ పై హమాస్ జరిపిన దాడికి మూల్యం చెల్లించుకుంటుందని.. ఇదే విధమైన బుద్ధి భారత్ పాక్ కు చెప్పడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version