NTV Telugu Site icon

MP Raghunandan Rao: బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు

Raghunandan

Raghunandan

MP Raghunandan Rao: బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. బీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ( రిటైర్ మెంట్)ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్క తోక పటాకులు పేలుతాయా లేక సూతిల్ బాంబులు పేలుతాయో చూడాలన్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తామన్నారు. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12వందల కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

Read Also: BC Caste Census: బీసీ కులగణనపై గాంధీ భవన్‌లో సమావేశం

సొమ్ము కేంద్రానిది అయితే ఇందిరమ్మ పేరు పెట్టారన్నారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటామన్నారు. ఇందిరమ్మ కమిటీలకు ఒక విధానం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గతంలో సిరిసిల్ల, సిద్దిపేట సుడా చేసుకున్నారని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌ను కుడా చేసుకున్నారన్నారు. గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. గ్రామ పంచాయతీకి ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ భాగస్వామ్యం లేదని ఆయన తెలిపారు. ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కాదన్న ఆయన.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తామన్నారు. పేదలు నివసించే 15 కిలోమీటర్లు వదిలిపెట్టి మిగతా మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీ రఘునందన్‌ రావు ప్రభుత్వానికి సూచించారు.

Show comments