Site icon NTV Telugu

MP K.Laxman : ఆయన కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపొడు

Mp K Laxman

Mp K Laxman

తెలంగాణ బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. ప్రపంచం కీర్తించే వ్యక్తి అయిన మోహన్ భగవత్ పై కేటీఆర్ తన స్థాయిని మరిచి కామెంట్స్ చేసారని, అయన కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపొడంటూ ఆయన విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి సంస్థ పట్ల మాట్లాడే స్థాయి లేదని, చిల్లర మాటలను కేటీఆర్ ఉప సంహరించుకోవాలని ఆయన హితవు పలకారు.

 

అవినీతి, కుటుంబ పాలనను దేశానికి పరిచయం చేసేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు జాతీయ రాజకీయాలు అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికి మునుగోడు గెలుపు నాంది పలుకుతామన్నారు.

 

Exit mobile version