కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్న అసెంబ్లీలో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని సంబంధించి వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదని ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ ఎంఐఎంని ప్రొటెం స్పీకర్ చేసిందని విమర్శలు చేశారు. అందుకే బీజేపీ ప్రొటెం స్పీకర్ ఎంపికను వ్యతిరేకించిందని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రాజకీయం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎవరిపేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారని.. విచ్ఛిన్నకర రాజకీయాలకు కేరాఫ్ గా కాంగ్రెస్ ఉందని దుయ్యబట్టారు.
Bandla Ganesh: రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు ఆ ‘సినిమా’ గుర్తొస్తోంది!
మరోవైపు.. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు ఇంట్లో కోట్ల రూపాయల నల్లధనం డబ్బు బయటపడింది.. నోట్ల లెక్కింపు మిషన్లు పాడైపోయేంత డబ్బు ఉందని లక్ష్మణ్ తెలిపారు. 300 కోట్ల నగదు దొరికింది.. ధీరజ్ సాహు మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారని.. ధీరజ్ సాహు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా ఉన్నారని చెప్పారు. ధీరజ్ సాహు వ్యవహారం పై ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. యుపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.
CM Bhagwant Mann: “మేము సైలెంట్‌గా ఉన్నాం కాబట్టే సీఎం అయ్యాడు”.. పంజాబ్ సీఎం కూతురు సంచలన ఆరోపణలు..
కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అది అవినీతి దోపిడీకి గ్యారెంటీ అని లక్ష్మణ్ విమర్శించారు. మోడీ గ్యారెంటీ అంటే అభివృద్ధి, పేదల సంక్షేమం, నల్ల ధనం వెలికితీయడం అని తెలిపారు. ఇండియా కూటమి నేతల అవినీతిని వెలికి తీస్తుంటే దర్యాప్తు సంస్థలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అవినీతిపరులు తిన్న సొమ్మంతా మోడీ కక్కిస్తారని ఆరోపించారు. ఝార్ఖండ్ లో కుంభకోణాలు పెరిగిపోయాయి.. ప్రధాని మోడీ పై చిన్న అవినీతి ఆరోపణ లేకుండా పాలిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్న మోడీకి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఎవరనేది నిర్ణయం ఉంటుంది.. ప్రజాస్వామ్య బద్దంగా సీఎం ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
