BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏలు ఒక్కటే.. వాళ్లకు ఓటేస్తే హోల్ సేల్ గా అమ్ముడు పోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ అంటే సబ్ కా వికాస్.. బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్.. కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఆ రెండు పార్టీలలో పని చేస్తున్న వారు ఆ కుటుంబాలకు బానిసలుగా వ్వవహరిస్తున్నారు.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుంది అరి ఆమర ఆరోపించారు. ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఇస్తామని మాటలు చెబుతుంది.. డిక్లరేషన్లు, గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజలని మరోసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. మైనారిటీ ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.. హిందువులను అవమానిస్తున్నాయి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించలేదు.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇక్కడ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించ లేదు అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.
Read Also: Health Tips : మటన్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
Also Read
ఇప్పుడు ఎన్నికల కోసం హామీలు ఇస్తున్నారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాజిక న్యాయం లో భాగంగా నే బీసీ నీ సీఎం చేస్తామని బీజేపీ చెబుతుంది.. బీసీ సీఎం అంటే బీసీల కోసం కాదు సమాజంలోని అన్ని వర్గాల కోసం.. కేసీఆర్ లేస్తే మనిషినీ కాదు అని అంటాడు కాని లేవడు.. కాపలా కుక్కల ఉంటానని అన్న కేసీఆర్ గుంట నక్కల వ్యవహరిస్తున్నారు.. రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. కొట్టినట్టు చేయ్యు.. ఏడ్చినట్టు చేయ్యు అన్నట్లు ఉంది అని ఆయన ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటే.. గతంలో కాంగ్రెస్ తో ఆ పార్టీ ఉంది.. మా మానిఫెస్టో ఓట్ల కోసం కాదు అమలుకు నోచుకోని హామీలు ఇవ్వం.. ఓవైసీ , రేవంత్ రెడ్డిలు ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు.. కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రీటైల్ గా, హోల్ సేల్ గా అమ్ముడు పోతారు.. ఈ విషయాన్ని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చెప్పారు.. బీసీ, ఎస్సీలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని కొందరు కుళ్ళుతో మాట్లాడుతున్నారు అంటూ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!