NTV Telugu Site icon

GVL Narasimha Rao: బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్‌లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు. చట్టంలో ఉన్న అంశాలన్నీ కేంద్రం నెరవేరుస్తుందన్నారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే అధిక లాభాలు కేంద్రం నుంచి వస్తాయన్నారు. రైల్వే జోన్ అంశం బీజేపీ పూర్తి చేస్తుందని.. రైల్వే జోన్‌కి ఏపీ ప్రభుత్వం భూమిని ఇవ్వలేదన్నారు. కేంద్రం హామీ ఇచ్చినవి అన్ని కేంద్రం నెరవేరుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉందని.. దేశంలో జెండా ఎత్తేసిందని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.

Read Also: Union Budget: నిర్మలమ్మ బడ్జెట్‌లో మహిళలు లబ్ధి పొందేవి ఏంటంటే..!

ఏపీలో కనుచూపుమేరలో కాంగ్రెస్ లేదని.. రాష్ట్రానికి నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్లేనని ఆయన విమర్శించారు. రాజకీయ ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ లేదని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తులపై అంతిమ నిర్ణయం జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారని.. జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు. చిరంజీవికి పద్మభూషణ్ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. రానున్న ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్న నమ్మకం బీజేపీకే కాదు విపక్షాలు, ప్రజలకు కూడా ఉందన్నారు. మార్పుకు సూచికంగా బడ్జెట్ ఉందన్నారు. 2013 -14లో భారత్ అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థను కలిగి వుంది. దేశ జీడీపీ 7.2 ఉంది అంటే ఇది ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచే అంశమని.. భారత్ ప్రపంచంలో మెరిసే తారలా ఉందన్నారు.

Read Also: Actor Shivaji: ఏ పార్టీ నాకు చుట్టం కాదు.. తప్పు చేస్తే ఎవ్వరినైనా..

పెట్టుబడుల రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు గత బడ్జెట్‌లో కేటాయించారని.. ఈ సంవత్సరం 11 లక్షల 10 వేల కోట్లకు పెట్టుబడుల రంగానికి కేటాయించారని ఆయన చెప్పారు. ఇది తాత్కాలిక బడ్జెట్ కాకుండా.. దేశ అభివృద్ధిని కొనసాగించే బడ్జెట్‌లా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ నాలుగు వర్గాల కోసం ఉందని.. యువత ,మహిళలు, రైతులు పేదల అభివృద్ధి కోసం ఆర్ధిక ప్రణాళికను బడ్జెట్ ద్వారా రూపొందించారని ఎంపీ జీవీఎల్ చెప్పారు. మధ్యతరగతి వారికోసం అద్దె ఇళ్లలో ఉండే వారికోసం సొంత ఇంటి కలను నెరవేర్చేలా కేంద్రం వ్యవహరించబోతుందన్నారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఆక్వా ఉత్పత్తులను పెంచేలా ,ఉద్యోగాలు కల్పించేలా కేంద్ర నిర్ణయాలు ఏపీకి మేలు కలిగిస్తాయని ఆయన వెల్లడించారు.రైల్వేలో మూడు ఎకనామిక్ కారిడార్లలో తెలుగు రాష్ట్రాలు లాభపడతాయన్నారు. 40 వేల పాత భోగీలను వందే భారత్ స్థాయికి కేంద్రం తీసుకురానుందన్నారు.

Read Also: Union Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఇవే..

ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ..”లక్ష కోట్లతో సంస్థను ఏర్పాటు చేసి నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేలా ,రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కి అవకాశం ఇవ్వాలని ఇన్నోవేషన్ ఫండ్‌కి కేంద్రం శ్రీకారం కట్టబోతుంది. దేశ ఆర్థిక స్థితిగతులపై ఈ బడ్జెట్ సమావేశాల్లో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. 2014 కి ముందు దేశ ఆర్థిక వ్యవస్థ బాలేదు.. బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం అయ్యింది. రెవెన్యూ లోటు తక్కువ చేసి చూపారు. చిదంబరం హయాంలో తప్పుల లెక్కలు చూపారు. యూపీఏ ప్రభుత్వం చేసిన అప్పులు మోడీ ప్రభుత్వం తీర్చింది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని గతంలో ఇది బహిర్గత పరచలేదు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది.” అని ఆయన చెప్పారు.