NTV Telugu Site icon

GVL Narasimha Rao: అప్పటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమలులోకి..!

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈ రోజు లోక్‌సభలో చర్చించి.. ఆమోదించే అవకాశం కూడా ఉంది.. అయితే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే చర్చ సాగుతోంది.. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు.. జనగణన, డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇప్పుడు దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీలె నరసింహారావు మాట్లాడుతూ.. జన గణనను 2025 లోపు పూర్తి చేయాలని మోడీ సర్కార్ అలోచనగా తెలిపారు.. జనగణన , డీలిమిటేషన్ తర్వాత మహిళ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్న ఆయన.. 2026 నుంచి జరిగే ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

Read Also: Software Jobs: ఇంజనీర్స్ అలెర్ట్.. ఇకమీదట ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం కష్టమే..

చట్ట సభల్లో మహిళ సంఖ్య గణనీయంగా పెరగనుంది అన్నారు జీవీఎల్.. గతంలో మహిళ రిజర్వేషన్ల బిల్లును యూపీఏ సర్కార్‌ బుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో అనవసర అంశాలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మా బిల్లు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అంటూ మండిపడ్డారు. సరైన సమయంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును మోడీ సర్కార్ తీసుకువచ్చింది.. యూపీఏ మహిళా రిజర్వేషన్ల బిల్లులో 5 ఏళ్లకు ఒక సారి సీట్లు మార్చాలని ఉంది.. ఇలా చేస్తే మహిళా నాయకత్వం బలపబడదు.. అందుకే మోడీ ప్రభుత్వం మహిళ రిజర్వేషన్ల బిల్లులో 15 ఏళ్ల రొటేషన్ పద్ధతి ఉందని వెల్లడించారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

Show comments