GVL Narasimha Rao: అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం 550 ఏళ్ల కల.. జనవరి 22వ తేదీ భారత దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాస్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనవరి 22వ తేదీ భారత చరిత్రలో ఒక మరవరాని రోజుగా ఉంటుందన్నారు. ప్రపంచంలోని హిందువుల ఆరాద్య దైవం శ్రీరాముడు. అయోధ్యలో ఆలయ నిర్మాణం 550 సంవత్సరాల కలగా పేర్కొన్నారు. హిందూ బాహుల్య దేశమైన భారత దేశంలో గతంలో హిందువు కళలు, అధికారాలను అణచివేశారని ఆరోపించారు. కొన్ని పార్టీల తప్పుడు నిర్ణయాల కారణంగా హిందువులు దెబ్బతిన్నారు అని విమర్శించారు. ఇక, అయోధ్యలో రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయికాట్ చేయడం దారుణం అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇది పరాకాష్టగా ఆరోపించారు. దేశ ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిష్టను తగ్గించాలన్న దురాలోచనతో విపక్షాలు ఉన్నాయని యండిసడకడానే బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.
Read Also: V. Hanumantha Rao: తొందరపడి మాట్లాడితే నష్టపోయేది మీరే.. కేటీఆర్ పై వీహెచ్ ఫైర్..
కాగా, అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వివిధ క్రతువులు కొనసాగుతోన్న విషయం విదితమే.. అందులో భాగంగా గురువారం ఉదయం అయోధ్య రాముడి గర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య ఆలయంలోకి జై శ్రీరాం నినాదాల మధ్య తీసుకెళ్లారు.. ఇక, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది.. దీనికి ముందు శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి దర్శనం చేసుకున్న తర్వాత మోడీ హారతి ఇవ్వనున్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన కర్తగా ఉంటారని ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ వెల్లడించిన విషయం విదితమే.