NTV Telugu Site icon

Ram Shankar Katheria: దాడి కేసులో బీజేపీ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు పడే అవకాశం

Bjp Mp

Bjp Mp

Ram Shankar Katheria: 2011లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కటారియాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక మేజిస్ట్రేట్ రామ్‌ శంకర్‌ కటారియాను దోషిగా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వును ప్రకటించారు. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించారు. శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభకు అనర్హుడయ్యే అవకాశం ఉంది. యూపీలోని ఇటావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియా నవంబర్ 16, 2011న ఆగ్రాలోని ఓ విద్యుత్ సరఫరా కంపెనీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, మేనేజర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-3!

తన జైలు శిక్షపై రామ్ శంకర్‌ కటారియా స్పందిస్తూ, తన న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తానని, దానిపై అప్పీల్ చేస్తానని కటారియా చెప్పారు. “నేను సాధారణంగా కోర్టుకు హాజరయ్యాను. ఈ రోజు కోర్టు నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. నేను కోర్టును గౌరవిస్తాను, నాకు అప్పీల్ చేసే హక్కు ఉంది. నేను దానిని అమలు చేస్తాను” అని ఆయన చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా ఎంపీ కటారియాను భారత శిక్షాస్మృతిలోని 147 (అల్లర్లు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) సెక్షన్ల ప్రకారం కోర్టు దోషిగా నిర్ధారించింది. రామ్ శంకర్ కటారియా గతంలో కేంద్ర సహాయ మంత్రి, ఎస్సీ-ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Show comments