NTV Telugu Site icon

West Bengal: అందరు చూస్తుండగానే.. ఓ యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి..

Bjp Mp

Bjp Mp

BJP MP Candidate Kisses Woman: లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ పోటీ చేస్తున్నారు. గత సోమవారం నాడు తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఓ యువతి అందరు చూస్తుండగానే ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో వేదిగా.. బీజేపీపై విమర్శలు గుప్పించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే వారు.. ఇలా బీజేపీ పార్టీలో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు అంటూ టీఎంసీ విమర్శలు గుప్పించింది. నారీమణులకు ‘మోడీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇదేనంటూ నెట్టింట పేర్కొంది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

Read Also: Jr NTR Fans: అభిమానమా, లేక పైత్యమా? ఇదేం పని?

కాగా, ఈ ముద్దు సీన్ వివాదం కావడంతో ఎంపీ ఖగేన్‌ స్పందిస్తూ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఆమెను నా కుమార్తెలా భావించాను.. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి?.. కుట్రపూరితంగా వివాదం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి నా పరువుకు భంగం కలిగిస్తున్నారు ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత తెలిపారు. మరోవైపు, యువతి కూడా దీనిపై స్పందిస్తూ ఎంపీ అభ్యర్థికి సపోర్టుగా కామెంట్స్ చేసింది. సొంత కుమార్తెలా భావించే ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో తప్పేముందన్నారు. ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్‌ చేయడం మంచిది కాదు.. అక్కడ మా అమ్మానాన్న కూడా ఉన్నారని సదరు యువతి చెప్పింది.