Jr NTR Fans: అభిమానమా, లేక పైత్యమా? ఇదేం పని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR and Trivikram got Mobbed by Fans at Tillu Square Event: ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదిక కేంద్రంగా జరిగిన ఈ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో పాటు తిల్లు స్క్వేర్ యూనిట్ అంతా పాల్గొంది. అయితే ఈవెంట్ కేంద్రంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. వాస్తవానికి తెలంగాణలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త లో ప్రొఫైల్లో ఈవెంట్ పూర్తి చేద్దాం అనుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈవెంట్ మొదలైనప్పటి నుంచి తమ వైద్యాన్ని చూపించడం మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి సినిమా యూనిట్ లో ఎవరు మాట్లాడుతున్నా వారిని మాట్లాడనివ్వకుండా తమ అరుపులతో, కేకలతో అడ్డుపడుతూ వచ్చారు.
Vethika Ninnila: వెతికా నిన్నిలా.. కనుపాపల్లో కలలా అంటున్న రక్షిత్ అట్లూరి
Also Read
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
చివరికి ఎవరికి వారు ఆ అరుపుల్లో ఏం మాట్లాడతాము లే అని మమ అనిపించారు. చివరికి త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు కాస్త వినే ప్రయత్నం చేసినా చివరికి వాళ్లు వేదిక దిగి కారు ఎక్కడానికి వెళ్లేటప్పుడు మాత్రం వెళ్లి మీద పడుతూ వింతగా ప్రవర్తిస్తూ అటు దర్శకుడు త్రివిక్రమ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి పెద్ద ఎత్తున బౌన్సర్లను ఈవెంట్ నిర్వాహకులు అక్కడ మొహరించారు. అయితే ఆ బౌన్సర్లను కూడా పక్కకి తోసేస్తూ అభిమానులు తమ అత్యుత్సాహాన్ని పైత్యాన్ని ప్రదర్శించే వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియో చూసిన ఇతర అభిమానులు సాధారణ నెటిజన్లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూపింది, అభిమానమా లేక పైత్యమా? ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!