Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అన్న పార్టీలు ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని పోరాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పార్టీ నాయకులు పై మరో పార్టీ నేతలపై దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘విష సర్పం’తో పోల్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇది జరిగిన తర్వాత రోజే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని‘విషకన్య’గా అభివర్ణించారు. ప్రపంచమంతా ప్రధాని మోడీని ఆమోదించింది. అమెరికా ఒకసారి ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అనంతరం రెడ్ కార్పెట్ పరచి మరీ మోడీకి స్వాగతం పలికింది. ఇప్పుడు ఆయనను నాగుపాముతో పోలుస్తూ విషం చిమ్ముతాడని అంటోంది. సోనియా గాంధీ ఒక విషకన్య. ఆమె చైనా, పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ‘ఇండియా టుడే’ నివేదించింది.
Read Also:Bichagadu 2: బిచ్చగాడి రేంజ్ మారింది… ట్రైలర్ విజువల్స్ అదిరిపోయాయి
దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసి బీజేపీ నాయకత్వం నిరాశ చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని అవమానించేందుకే బీజేపీ నేతలు ఈ తరహా చర్యకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయమని బీజేపీ సీనియర్ నేతలే ఈ ఎమ్మెల్యేకు సూచించారని ఆయన ఆరోపించారు. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని దుర్భాషలాడడమే బీజేపీ నాయకత్వం పనిగా పెట్టుకుందని సూర్జేవాలా అన్నారు. వీటన్నింటికీ మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బసవరాజ్ బొమ్మైల మౌన ఆమోదం ఉందన్నారు. ప్రధానమంత్రికి గౌరవం, మర్యాద ఉంటే ఆ ఎమ్మెల్యేను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Also:Ganga Pushkaralu: గంగాపుష్కరాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు