NTV Telugu Site icon

Venkata Ramana Reddy: సభకు మాత్రమే కొత్త.. రాజకీయాలకు కాదు

Bjp Mla

Bjp Mla

బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాజకీయాలకు కొత్త కాదు కానీ.. సభకు మాత్రమే కొత్తని అన్నారు. సభకు కొత్తగా 50మంది ఎమ్మెల్యేలం వచ్చాం.. కొత్త సభ్యులు సీనియర్ సభ్యుల నుంచి నేర్చుకునేలా సభ ఉండాలని తెలిపారు. సభ తీరు చూస్తుంటే విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోతుందని ఆయన ఆరోపించారు. రైతులకు కావాల్సిన కరెంట్ సామాగ్రి అందడం లేదని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు తప్పితే ఎలక్ట్రిక్ డిపోలు ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. రైతులు ట్రాన్స్ఫార్మర్స్ కోరితే ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వ స్థలమా, ప్రైవేట్ స్థలమా.. అక్కడ ఇళ్లు నిర్మిస్తారా అనేది పరిశీలించకుండానే విద్యుత్ తీగలను వేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇళ్ల మీద నుంచి ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలని ఆయన చెప్పారు.

Read Also: Sangharsana: ఆగస్టు రేసులో మరో చిన్న సినిమా

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తెలిపారు. 23 వందల మంది మీటర్ రీడింగ్ చేస్తున్నారు.. మీటర్ రీడింగ్ చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. స్మార్ట్ మీటర్లను పెట్టిన ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వవచ్చు.. గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అవినీతి చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. పారదర్శకంగా వ్యవహరించామని బీఆర్ఎస్ చెబుతోందన్నారు. హౌస్ కమిటీ వేసి విద్యుత్ అక్రమాలపైన విచారణ జరిపించాలని.. సభలో హుందాగా ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు