Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించారు. ప్రధాని పర్యటనకు ముందు బీజేపీ ఎమ్మెల్యే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి.. ప్రధానమంత్రి మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా శనివారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
READ MORE: Montha Effect : ఎల్లుండి ఏపీకి కేంద్ర బృందం.. ఈ జిల్లాల్లో పర్యటన
అయితే.. దానికి ముందు, వారణాసి కాంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ రైల్వే స్టేషన్‌కు చేరుకుని సన్నాహాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జవాన్‌తో ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. ఎమ్మెల్యే శ్రీవాస్తవ పార్టీ కార్యకర్తలను రైల్వే స్టేషన్ లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినందున ఈ ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య కుమ్ములాట జరిగినట్లు చెబుతున్నారు.
READ MORE: DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత..
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారికి మధ్య జరిగిన ఘర్షణకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నందుకు, ఇంత గందరగోళాన్ని సృష్టించినందుకు బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి. ఇది ప్రధానమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ దుండగులకు ఉదాహరణ. ప్రధాని నియోజకవర్గంలోనే ఇలా ఉంది. ఇతర ప్రదేశాల విషయానికొస్తే, ఇంకా ఏమి చెప్పాలి? ఇది ఖండించదగినది – శిక్షార్హమైనది!” అని అఖిలేష్ ట్వీట్ చేశారు.