NTV Telugu Site icon

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట.. ఆ మూడు కేసుల్లో నిర్దోషిగా తేల్చిన కోర్టు..

Mla Raja Singh

Mla Raja Singh

మరో మూడు కేసుల్లో రాజా సింగ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.

READ MORE: Rangareddy District: ప్రాణం తీసిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత

కాగా.. గోషామహల్‌‌‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌పై 2022లో పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. 2022 ఫిబ్రవరి 19న మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మతపరమైన కామెంట్లు చేశారనే ఆరోపణలతో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ టైమ్​లో 41 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ పాటించలేదని రాజాసింగ్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్‌‌‌‌ రిమాండ్‌‌‌‌ రిజెక్ట్‌‌‌‌ కావడంతో పోలీసులు లీగల్‌‌‌‌ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై లోగడ నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు. పీడీ యాక్ట్‌‌‌‌ ప్రయోగించేందుకు అనుకూలంగా మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌, షాహినాయత్‌‌‌‌ గంజ్‌‌‌‌ స్టేషన్లలో నమోదైన కేసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుల్లో రాజా సింగ్ నిర్దోషిగా తేలారు.