NTV Telugu Site icon

Shilpa Reddy : రాష్ట్ర బడ్జెట్‌లో మహిళలకు అన్యాయం జరిగింది

Bjp Shilpa Reddy

Bjp Shilpa Reddy

రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్‌ శిల్పా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ “అబద్ధాల పుట్టా” అని ఆమె వ్యాఖ్యానించారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలేవి..? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు..ఆ సంగతేంది..? అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి.. మరి వాటి ప్రతిపాదనలేవి..? నిధులెక్కడ..? అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం చేస్తామని చెప్పిన మీరు.. బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు..? అని ఆమె అన్నారు. పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను అని ఎన్నికల ముందు చెప్పిన్రు.. బడ్జెట్ లో ఆ ఊసేలేదని, ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ఈ ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు మొండి చేయే చూపిన్రు అని ఆమె వ్యాఖ్యానించారు.

Team India: ప్రపంచకప్ గెలవడంతో జెర్సీలో కీలక మార్పు..

అంతన్నారు.. ఇంతన్నారు.. ఏవో అంకెలు చూపించి, జనానికి గొప్పగా చూపించారు…బడ్జెట్ తో గతి తప్పి.. ప్రగతి మునకేయడమే తప్ప ఏం కనపడ్తలేదు అని, అంగడికి పోయి గొంగడి తెచ్చినట్లు ప్రగతి తెచ్చే బడ్జెట్ ప్రకటిస్తామని అసెంబ్లీలో తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయానికి కేటాయింపులకు ఖర్చులకు పొంతనలేదు బడ్జెట్ పేరుతో చేస్తున్న అంకెల గారడివి జనం చూసి నవ్వుకుంటున్నారని, భట్టి మాటలన్నీ శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే ఏమో అంకెలు పేరు జనానికి గొప్పగా చూపిస్తామని రీతిలో అసెంబ్లీలో సినిమా చూపించిండ్రు తప్ప ఒరిగింది ఏమి లేదన్నారు.

Delhi: ఢిల్లీలో కూలిన ఆస్పత్రి భవనం.. ఒకరి మృతి