NTV Telugu Site icon

Yamini Sharma: ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారా..?

Yamini Sharma

Yamini Sharma

Yamini Sharma: ఆడలేక మద్దెల దరువన్న విధంగా వైసీపీ పరిస్థితి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శించారు. జగన్ చేసే మద్యం అక్రమాలను బీజేపీ అధ్యక్షురాలు ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేక పోయారని ఆమె ఆరోపించారు. ఆర్ధిక అవినీతి, అప్పుల పాలవుతున్న వైనం పురంధరేశ్వరి వివరించారని యామిని శర్మ చెప్పుకొచ్చారు. ఒక మహిళ అనే ఇంగితం కూడా లేకుండా మాట్లాడిస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Also Read : Vandebharat Express: విజయవాడ నుంచి చెన్నైకి మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌.. రేపే ప్రారంభం

యామిని శర్మ మాట్లాడుతూ.. “అధికారమిస్తే మంచి పాలన అందించకుండా.. ప్రతిపక్షాల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. ప్రజలకు మంచి పాలన ఇస్తారనే కదా వైసీపీకి అధికారం ఇచ్చారు. వైసీపీ నాయకులు ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారా..?. మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే విమర్శలు చేయిస్తారా..?. వైసీపీ లాంటోళ్లకు తగిన బుద్ధి చెప్పే ధైర్యం, దమ్ము బీజేపీకి ఉన్నాయి. అన్ని వర్గాల వారు జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం అసమర్థ పాలన‌ చేస్తున్నారు. జగన్ దోచుకున్న ప్రతి పైసా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు మంచి పాలన చేయండి.. లేదంటే ప్రజలే మీకి బుద్ధి చెబుతారు.” అని యామిని శర్మ వ్యాఖ్యానించారు.