NTV Telugu Site icon

Vishnu Kumar Raju: వైసీపీకి 17 సీట్లు కూడా రావు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండాలి..!

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 175 సీట్లు కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. జగన్ ఓటర్ గుర్తింపు కార్డులను మార్ఫింగ్ చేయడం తిరుపతిలో ఉప ఎన్నికలు నుంచి ప్రారంభించారు. 30 వేలు దొంగ ఓట్లు వేయించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40 వేలు దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి 20 వేలు దొంగ ఓట్లు తొలగించారని సమాచారం ఉందన్నారు. అసలు వైసీపీకి 175 కాదు.. 17 సీట్లు కూడా రావు.. జగన్ కు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి.? రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకా? అని ప్రశ్నించారు.

Read Also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ పీసీసీ గా రావడం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు విష్ణు కుమార్‌ రాజు.. దొంగ ఓట్లు, దోచుకున్న డబ్బు పంచి.. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ వైఎస్‌ జగన్, ఆయన అనుచరులు పై దాడులు చేయాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. మేం అధికారంలోకి రాగానే చీఫ్ లిక్కర్ తీసేసి నాణ్యమైన లిక్కర్ అందిస్తాం అని ప్రకటించారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపానం చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారు.. జగన్ కుటుంబాలలో కలహాలు పెడుతున్నారు అని మండిపడ్డారు.

Read Also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు

ఇక, బొత్స ఝాన్సీ.. విశాఖలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదన్నారు విష్ణు కుమార్‌ రాజు.. వైసీపీ నాయకులు వింతపనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి కనుమ కానుకగా నాసిరకం మద్యం, కోడి పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని ఎన్నికల సభలు పెట్టిన శుద్ధ దండగ. జగన్ ఒక్క సీటుకి 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. జగన్ ఇక నీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. మీరు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచే పరిస్థితి ఇక లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా ఎంక్వయిరీ చేస్తున్నారు. వైసీపీ నామ రూపాలు లేకుండా పోయే పరిస్ఠితి వస్తుందన్నారు. మరోవైపు, సెంట్రల్ గర్నమెంట్ అన్ని కేంద్ర సంస్థలకి ఈ నెల 22 తేదీన హాఫ్ డే సెలవు ప్రకటించింది. మన రాష్ట్రంలో ఆ రోజు సెలవు ప్రకటించక పోవడం చాలా దురదృష్టకరం అన్నారు. స్కూల్స్ కి 21 వరకు సెలవు ప్రకటించి, 22 తేదీన హిందువుల కోసం సెలవు ప్రకటించలేరా ? అని నిలదీశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు.