Site icon NTV Telugu

BJP Bashkar Goud : తన మీద తానే హత్య ప్రయత్నం చేయించుకున్న బీజేపీ నేత భాస్కర్ గౌడ్

Bhaskar Goud

Bhaskar Goud

బీజేపీ నేత భాస్కర్ గౌడ్ తన మీద తానే హత్య ప్రయత్నం చేయించుకున్నట్లు పోలీసుల గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత భాస్కర్ గౌడ్‌ నామీద హత్య ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. కేసు నమోదు చేసుకొని ఉప్పల్‌ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాస్కర్ గౌడ్ నిందితుడని తెలియడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ పద్మజా మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్ లో నివాసం ఉంటున్నాడని, ఇతను సినీ నిర్మాతగాను, బీజేపీ హిందూ ప్రచార కమిటీ గాను వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు.

 Andhra Pradesh: కన్నుల పండువగా వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం

అయితే తను సమాజంలో పలుకుబడి కోసమో ఈ మర్డర్ ప్లాన్ చేయించుకున్నట్లు, తనకు గన్మెన్లు వెంట ఉంటే సమాజం నన్ను గౌరవిస్తుందని దురుద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్ లో ఈ మర్డర్ ప్లాన్ జరిగిందని, ఈ మర్డర్ ప్లాన్ కోసం 2,50,000 ఒప్పందం భాస్కర్ గౌడ్ కుదుర్చికున్నాడని ఆమె పేర్కొన్నారు. భాస్కర్ గౌడ్ పై జంటనగరాల్లో ని పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. వీరివద్ద నుండి ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని ఆమె వెల్లడించారు. ఈ మర్డర్ ప్లాన్ కు సహకరించి భాస్కర్ గౌడ్ తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన ఉప్పల్ పోలీసులు ఇంకో ఇద్దరు పరార్‌లో ఉన్నట్లు తెలిపారు.

KRMB: సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు.. విడుదల చేసేందుకు కేఆర్‌ఎంబీ అనుమతి

Exit mobile version