NTV Telugu Site icon

NVSS Prabhakar: ఢిల్లీ నూతన ఎక్సైజ్ పాలసీ.. తెలంగాణ విధానాన్ని అనుసరిస్తోంది..

Nvss Prabhakar

Nvss Prabhakar

NVSS Prabhakar: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. లంచం ఇచ్చిన వాళ్లకే దళిత బంధు, రెండు పడక గదులను ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్​ఎస్​ సొమ్ములాగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పర్యవేక్షణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్ కోరారు.

Rummy Lessons: పాఠ్యపుస్తకాల్లో రమ్మీ పాఠాలు.. విద్యాశాఖపై విమర్శల వర్షం

డిల్లీ నూతన ఎక్సైజ్ విధానం.. తెలంగాణ విధానం ఒకటేనని ప్రభాకర్ ఆరోపించారు. ఢిల్లీ, తెలంగాణలో మద్యం సరఫరా చేసేది ఒక్కరేనని విమర్శించారు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో మద్యం విధానాన్ని రెండు సార్లు సవరించడంతో పాటు విపరీతంగా ధరలు పెంచారని విమర్శలు గుప్పించారు. అర్ధాంతరంగా ఎక్సైజ్ శాఖ మంత్రిని తొలగించారని పేర్కొన్నారు. కవిత కనుసన్నల్లో ఉన్నే వ్యక్తికే ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. తెలంగాణ ఎక్సైజ్ విధానం, మద్యం అమ్మకాలపైన సీబీఐ విచారణ జరపాలని ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Show comments